Discover how Hydra is shifting its key focus to Hydra disaster management. Learn about the new strategies and initiatives aimed at improving urban safety. (హైడ్రా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పై దృష్టి పెట్టింది. నగర రక్షణ ను మెరుగుపరిచే కొత్త వ్యూహాలు, చర్యలు గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.)
హైదరాబాద్: మారుతున్న హైడ్రా రూట్ – కేవలం కూల్చడమే కాదు, మరింత దృఢంగా ముందుకు!
హైడ్రా రూట్ మారుస్తుంది . కేవలం అక్రమ నిర్మాణాలు కూల్చడమే కాదు, నగరాన్ని వరదల నుంచి రక్షించే పని లో కూడా పడనుంది . మరి ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందున్న కొత్త లక్ష్యాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఇటీవల, హైడ్రా వందలాది అక్రమ నిర్మాణాల ను కూల్చేసి హైదరాబాదు మాత్రమే కాకుండా దేశమంతటా పేరు తెచ్చుకుంది. అయితే, కోర్ట్ కేసులు వివిధ రకాల కారణాల వల్ల కొంతకాలం ఎటువంటి డిమోలిషన్ చర్యలు తీసుకోవడం లేదు ముందుగా వ్యవస్థ ను స్ట్రాంగ్ చేసి తరువాత పనిలో దిగాలని గ్రౌండ్ వ్రోక్ చేస్తునట్టు కనిపిస్తుంది . తాజాగా, నగరంలో వరదలు, వాటి కారణాలు, పరిష్కార మార్గాలపై హైడ్రా ద్రుస్టి పెట్టింది . ఈ క్రమంలో బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తూ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశాలు నిర్వహించారు.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్: Hydra disaster management
హైడ్రా కార్యాలయంలో జరిగిన సమావేశంలో, బెంగళూరుకు చెందిన నేచురల్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ సెంటర్ మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వంటి నిపుణులతో చర్చ జరిగింది. ఈ సందర్భంగా, హైడ్రా కార్యాలయంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో, బెంగళూరులో అమర్చిన సెన్సార్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, నాలాల్లో చెత్త పేరుకుపోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి వరద వస్తే ఎ విధమైన చర్యలకు రెడీ గా ఉండాలని డిస్కస్ చెయ్యడం జరిగింది .
సమగ్ర వ్యూహం:
రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నప్పటికీ, కేవలం హైదరాబాదుకే కాకుండా, ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలకూ అధ్యయనం చేసి, సమన్వయంతో మరింత మెరుగైన వ్యవస్థను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధానాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు.
వరదల సమయంలో అప్రమత్తత:
వానా కాలం లో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు చర్యలతో ప్రజలకు ప్రాంతాల వారీగా వెదర్ రిపోర్ట్‌లను అందజేసేలా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు . గ్రేటర్ హైదరాబాదు పరిధిలో డివిజన్ల వారీగా వెదర్ స్టేషన్ల నుంచి వర్షపాతం, వరద ముప్పు వంటి సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా చెయ్యాలని హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేసింది. రోడ్లపై వాన నీళ్ళు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా మళ్ళించే చర్యలు తీసుకోవాలని, చెరువుల గోలుసుకట్టు వ్యవస్థను సరిచేయాలని కూడా రంగనాథ్ సూచించారు.
హైడ్రా నిపుణులు ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యతను కూడా తీసుకోనున్నారు. ఈ మేరకు, అన్ని చెరువుల వరదను సాఫీగా ముందుకు సాగేలా గమనించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ తెలియజేశారు.