171 Lakes Encroached in Hyderabad Between 2014-2023: HYDRA Hyderabad lake Restoration Efforts Explained

HYDRA Hyderabad Lake Restoration Efforts Explained – Discover how 171 lakes in Hyderabad were encroached between 2014 and 2023. This report highlights the scale of illegal constructions and explains HYDRA Hyderabad lake restoration efforts to clear encroachments and protect vital water bodies for flood control and environmental sustainability.

“2014-2023 మధ్య 171 Lakes ఎలా ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుందాం. Hydra తయారు చేసిన నివేదికలో అక్రమ నిర్మాణాల వ్యవహారం పూర్తిగా CM కి మ్యాప్ ల తో సహా వివరించడం జరిగింది మరియు HYDRA యొక్క Lake Restoration పద్ధతులు ఆక్రమణలను తొలగించడంలో మరియు వరద నియంత్రణకు మరియు పర్యావరణ మౌలికతకు ముఖ్యమైన వాటర్ బాడీస్‌ను రక్షించడంలోహైడ్ర పద్దతులు ఎలా ఉండబోతున్నాయి అంతేకాకుండా తీసుకునే జాగ్రత్తలు చర్యలు ఏమిటి అని పూర్తిగా వివరిచడం జరిగింది .”

2014 నుంచి 2023 మధ్య హైదరాబాద్‌లో 171 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి

HYDRA Hyderabad lake Restoration Efforts Explained

చెరువుల ఆక్రమణపై ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ నివేదిక

తెలంగాణ ఏర్పడిన నాటినుంచి గత పదేళ్లలో అంటే తెలంగాణ లో BRS పార్టీ అధికారం లో ఉన్న సమయం లో హైదరాబాద్ నగరంలో మొత్తం 171 చెరువులు లేదా వాటర్ బాడీస్ ఆక్రమణకు గురయ్యాయని ఇందులో ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్నవి కూడా ఉన్నాయని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ నివేదికను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సమర్పించారు.

హైదరాబాద్‌లో ఉన్న మొత్తం చెరువుల సంఖ్య ఎంత?

నివేదిక ప్రకారం హైదరాబాద్‌ సహా నగర పరిసర ప్రాంతాల్లో మొత్తం 920 చెరువులు ,కుంటలు ఉన్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు మొత్తం 225 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని 196 చెరువులు పాక్షికంగా ఆక్రమించబడ్డాయని 499 చెరువులు ఆక్రమణలకు గురి కాలేదని నివేదిక పేర్కొంది. ఇందులో BRS పార్టీ పెద్దల హస్తం ఉందని చాలా క్లియర్ గా కనిపిస్తుంది .

గత దశాబ్దంలో చెరువుల ఆక్రమణ ఎలా పెరిగింది?

తెలంగాణ ఏర్పాటుతో ప్రారంభమైన ఈ 10 ఏళ్లలో 20 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి ఇంతకు ముందు పాక్షికంగా ఆక్రమించబడిన 24 చెరువులు పూర్తిగా ఆక్రమించబడ్డాయి. మరో 127 చెరువుల్లో ఆక్రమణలు గణనీయంగా పెరిగినట్లు నివేదిక తెలిపింది.

సాటిలైట్ ఇమేజెస్‌తో చెరువుల ఆక్రమణ వివరాలు

ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ నివేదికలో సాటిలైట్ ఇమేజెస్ (satellite images) తో పాటు ఆక్రమణకు గురైన చెరువుల జియో లొకేషన్స్ (geo locations) కూడా పొందుపరిచారు. ఈ నివేదిక విడుదల కావడం HYDRA (Hyderabad Disaster Response and Asset Protection Agency) ఆధ్వర్యంలో చెరువుల ఆక్రమణ తొలగింపు చర్యల వేళ కీలకమైంది.

HYDRA చర్యలు: అక్రమ ఇళ్ళ కూల్చివేతలు HYDRA Hyderabad lake Restoration Efforts Explained

HYDRA ఆధ్వర్యంలో మూసి నది తీరంలో అక్రమంగా నిర్మించిన ఇళ్ళను కూల్చి ప్రజలను అక్కడి నుండి ఖాళీ చేయిస్తున్నాయి. గత రెండు వారాల్లో HYDRA మరియు పౌర అధికారులు నది తీరంలోని వందలాది ఇళ్ళను కూల్చి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

రాజకీయ దుమారం HYDRA చర్యలపై ప్రతిస్పందన

ఈ కూల్చివేతల చర్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి HYDRA చర్యలను సమర్థిస్తూ ఖాళీ చేయబడిన ప్రతి ఒక్కరికీ 2BHK ఇళ్ళను ఇవ్వనున్నామని తెలిపారు.

Leave a Comment